ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): డ్యామ్ సేఫ్టీయాక్ట్ 2021ను అనుసరిస్తూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈఎన్సీ మురళీధర్ చైర్మన్గా స్టేట్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీని నియమించింది.
రాష్ట్రం నుంచి సభ్యులుగా ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈఎన్సీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, రామగుండం ఈఎన్సీ వ్యవహరిస్తారు. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ చీఫ్ ఇంజినీర్లు, ఓయూ, జేఎన్టీయూ నుంచి హైడ్రాలజీ, డ్యామ్ డిజైన్ నిపుణులను, సీడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజీ, పవర్ తదితర రంగాల నిపుణులను ఇంకా నియమించాల్సి ఉన్నది.