జ్యోతినగర్, సెప్టెంబర్ 1: ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ)లో ఉత్పత్తికి ముందడుగు పడుతున్నది. బుధవారం ఎన్టీపీసీ యాజమాన్యం 800 మెగావాట్ల యూనిట్-1లో ప్రధానమైన స్టీమ్ బ్లోయింగ్ మొదటి ప్రక్రియను ప్రారంభించింది.
కోల్ రీహీట్ స్టీమ్ పైపులైన్ నుంచి స్టీమ్ (ఆవిరి)ను సరఫరా చేశారు. రాత్రి 9.44 నిమిషాల నుంచి 9.48 నిమిషాల వరకు స్టీమ్ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. దీంతో యూనిట్-1లో విద్యుత్తు ఉత్పత్తి నమోదుకు దాదాపుగా పనులు చివరి దశకు చేరాయి. రెండు నెలల్లో ఇందులో విద్యుత్తు ఉత్పత్తి జరుగనున్నది.