హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : రాబోయే సాధారణ ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ గెలుచుకొంటుందని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ జోస్యం చెప్పారు. మంగళవారం మంత్రి రోజాతో కలిసి నగరిలోని కొంటగట్టు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అని చెప్పారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు అందుతున్నాయని తెలిపారు.