హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయించింది.ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మాడల్స్కూళ్లు విధిగా సెలవులను పాటించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ శనివారం ఆదేశాలిచ్చారు. కాలేజీలు తిరిగి 17న తెరుచుకొంటాయని తెలిపారు. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడమేగాక, గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించారు.