బేల, మే 13: ఇతర రాష్ర్టాల పంట ఉత్పత్తులను మన రాష్ట్రంలో కొనుగోళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. మంగళవారం సబ్ మారెట్ యార్డులోని జొన్నల కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలు ప్రక్రియను ఈ నెల చివరి నాటికి, జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. హమాలీలు, లారీల కొరత వంటి సమస్యలపై ఆరా తీసి సమస్యలను పరిషరించాలని, రేపటి లోగా హమాలీలు కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించా రు. ఆదిలాబాద్ జిల్లాలో 16 కోనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేశామని, ఇంకా అదనం గా రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ యేడాది మన జిల్లాలో సుమారుగా 7 నుంచి 8 లక్షలు ఎకరాల్లో జొన్న పంట పం డించడం జరిగిందన్నారు. హమాలీ, స్ట్రిచింగ్ చార్జీలను నిబంధనల ప్రకారం తీసుకోవాలని, అధికంగా తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, డీసీవో మోహన్ నాయక్, ఎంపీడీవో మహేందర్ కుమార్, మండల వ్యసాయాధికారి సాయి తేజరెడ్డి పాల్గొన్నారు.