హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఐటీ, డిజిటల్ మీడియా సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి (గడిగోలు) ఫేస్బుక్ గ్రూప్ బతుకమ్మ పాటల వీడియోలను ఆహ్వానిస్తున్నది. తెలంగా ణ సంస్కృతి చిహ్నమైన బతుకమ్మ పాటలు, వీడియో లు (సంప్రదాయ పాటలు పాడుతూ, లయబద్ధంగా ఆడుతూ ఉండేవి మాత్రమే) సేకరించాలని నిర్ణయించింది.
వివిధ జిల్లాల్లోని గ్రూపు సభ్యులు తమ ప్రాం తంలో ఆడే బతుకమ్మ ఉత్సవాలను వీడియోలు (కనీసం 3 నిమిషాలు) తీసి గ్రూప్లో పోస్ట్ చేయాలని అడ్మిన్లు కోరుతున్నారు. ఉత్తమ వీడియోలకు తగిన గౌరవం కల్పిస్తామని చెప్పారు. ఇందులో దాండియా, కోలాటాలు ఉండకూడదని వారు సూచించారు.