హైదరాబా ద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఒడిశా రాష్ట్రంలోని నైనీ కోల్బ్లాక్కు అన్ని రకాల అనుమతులొచ్చాయని, జనవరి నుంచి ఈ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు. బొగ్గు వెలికితీత కు ముందు కోల్ బంకర్, విద్యుత్తు సబ్స్టేషన్, జనరేటర్ వంటి వాటిని నె లకొల్పాలని, బొగ్గు రవాణాకు ఏర్పా ట్లు చేయాలని తెలిపారు. సింగరేణి భవన్ నుంచి శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ సమీక్షించా రు. కొత్తగా రిక్రూట్ అయిన వారికి ఈ నెల 10లోగా నియామక ఉత్తర్వు లు అందజేయాలని ఆదేశించారు.