హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీఎన్ భారతి, చావ రవి ఎన్నికయ్యారు. కోల్‌కతాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ఐ రజతోత్స వేడుకలు ఆదివారం ముగిశాయి.
ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన రవి ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర కమిటీలో మహిళా ప్రతినిధిగా దుర్గాభవాని, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఏ వెంకట్, ఆర్ శారదను ఎన్నుకున్నారు. వీరు మూడేండ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న చావ రవి ఎన్నికపై టీఎస్‌యూటీఎఫ్ బాధ్యులు అభినందించారు.