CM Revanth Reddy | నేడు సొంతూరుకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి(Kondareddypalli) వెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం దసరా(Dasara) వేడుకలు రేవంత్ రెడ్డి తన సొంతూర్లో చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి(Kondareddypalli) వెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం దసరా(Dasara) వేడుకలు రేవంత్ రెడ్డి తన సొంతూర్లో చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కొండారెడ్డిపల్లిలో నేడు సీఎం పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సుమారు రూ.72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి ఎనుముల నరసింహారెడ్డి పేరు పెట్టారు.
రూ.45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, రూ.70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, రూ.25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడ్రన్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యత్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్మెంట్ పనులను దసరా రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

