యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. తన జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్టలో సీఎం ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోశాలను బెస్ట్ మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని, గోసంరక్షణకు పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భూసేకరణకు సంబంధించి అన్ని కేసులను క్లియర్ చేయాలని సూచించారు.