హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్లో సీఎం రే వంత్‌రెడ్డి పేరు చేర్చినందున వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాజకీయ పదవుల కోసం రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియన్ సంస్థ కోసం కోట్ల రూపాయలను విరాళంగా సేకరించారని ఆరోపించారు. ఈ చర్యలు చట్టపరమైన నిబంధనలతోపాటు రాజ్యాంగ నైతికతను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవిలో రేవంత్‌రెడ్డి కొనసాగడం అంటే ప్రజాసేవ ఆత్మను కించపర్చడమే అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు అత్యుత్తమ ప్రమాణాలు కలిగి ఉండాలని సూచించారు. ఈడీ కేసు దర్యాప్తులో ఉండ గా సీఎం పదవిలో రేవంత్‌రెడ్డి కొనసాగడం అంటే అది కుర్చీ గౌరవాన్ని కించపర్చడమేనని అభిప్రాయపడ్డారు. ఈఅంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. కేసులో పేరు ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.