హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): నారాయణపేట జిల్లా ఉటూర్ మండలంలో గువ్వల సంజీవ్‌ను కొట్టి చంపిన ఘటనను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే, బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్యచేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.