Revanth Reddy | న్యూఢిల్లీ : రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమ్మక్క – సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందెశ్రీనే కీరవాణిని ఎంపిక చేశారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. ఎవరితో సంగీతం చేయించువాలనేది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశాను అని పేర్కొన్నారు.