Hyderabad | హైదరాబాద్‌లో ఈ హత్యలేంది?.. సీపీ కొత్తకోటకు సీఎం రేవంత్‌రెడ్డి తలంటు
Hyderabad | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నగరంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌లు, కాల్పులు పెరగడం, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై నిత్యం పత్రికల్లో కథనాలు రావడంపై అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నగరంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌లు, కాల్పులు పెరగడం, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై నిత్యం పత్రికల్లో కథనాలు రావడంపై అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సదస్సు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ నగర శాంతిభద్రతల అంశం వచ్చినపుడు హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి సీఎం వేసిన వరుస ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది.
‘హైదరాబాద్‌లో వరుసగా హత్యలు జరగడమేంటి? తరచూ కాల్పులు ఎందుకు జరుగుతున్నయ్? డయల్ 100 స్పందన సమయం ఎందుకు పడిపోయింది?’ అని సీఎం ప్రశ్నించగా సీపీ శ్రీనివాస్‌రెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పారని తెలిసింది. కమిషనరేట్‌లో ఐటీ సెల్ ఎందుకు సరిగా పని చేయడంలేదని సీఎం ఆరాతీశారని, ప్రజా సంబంధాల్లో ఎందుకు విఫలమవుతున్నారో చూసుకోవాలని సీపీకి సీఎం సూచించారని సమాచారం. గతంలో రంజాన్ సందర్భంగా మీడియాకు గిఫ్ట్‌లు ఇచ్చేవారని, ఈసారి కూడా తనను అడిగితే ఇవ్వనందున వ్యతిరేక వార్తలు వస్తున్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి చెప్పగా సీఎం సంతృప్తి చెందలేదని తెలిసింది.
నగరంలో పోలీసింగ్ అనేది ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని, రెండు నెలల్లో నగర పోలీసింగ్ వ్యవస్థ గాడిన పడాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. సైబరాబాద్ పరిధిలో కొంతకాలం కిందట కుమారి ఆంటీ మెస్‌ను పోలీసులు తొలగిస్తే అది తానే చేసినట్టుగా ప్రజల్లోకి వెళ్లిందని, అలాంటి చర్యలు తీసుకునేముందు ఆలోచించాలి కదా! అని సీఎం సున్నితంగా మందలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఖర్గే పేరిట ఫేక్ మెసేజ్‌ను చూపిన సీఎం
సైబర్ క్రైం విభాగం ఎందుకు సరిగా పనిచేయడం లేదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అదనపు డీజీ అయిన సీపీ శిఖా గోయల్‌ను సీఎం ప్రశ్నించినట్టు తెలిసింది. పక్కనే ఉన్న ఓ మంత్రి మొబైల్ తీసుకొని అందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరుతో ఉన్న ఫేక్ మెసేజ్‌ను చూపినట్టు సమాచారం. ప్రస్తుతం ఖర్గే అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని, ఆయన దగ్గర ఫోన్ కూడా లేదని, అయినా ఇలా మెసేజ్‌లు వస్తున్నాయని సీఎం అనడంతో అలాంటివి సహజమేనని శిఖా గోయల్ సమాధాన మిచ్చినట్టు తెలిసింది. దీంతో అలా జరిగితే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా ఆమె మిన్నకుండిపోయినట్టు సమాచారం.
నైజీరియన్లు సైబర్ క్రైమ్‌కు ఎక్కువగా పాల్పడుతున్నారని శిఖా గోయల్ చెప్పగా వీసా గడువు ముగిసినా నగరంలో వాళ్లు ఎందుకు ఉంటున్నారు? గుర్తించి చర్యలు తీసుకోవాలి కదా! అని సీఎం ప్రశ్నించడంతో అధికారులు తెల్లమొహం వేసినట్టు తెలిసింది. సమర్థులైన అధికారులు అని ఏరికోరి తెచ్చుకున్నానని, కానీ ఆశించిన స్థాయిలో పనితీరు కనిపించడంలేదని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారని, పనితీరు మెరుగుపడకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా సీఎం హెచ్చరించారని సమాచారం. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై టీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా సీఎం ప్రశంసించినట్టు తెలిసింది.
సమగ్ర సమాచారంతో రాని అధికారులు..
సీఎం రేవంత్ రెండో పర్యాయంగా నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సు నాన్ సీరియస్‌గా జరిగిందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన సదస్సులను పోలుస్తూ వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేసీఆర్ అధికారులకు వేసే ప్రశ్నలు సూటిగా ఉండేవని, ముఖ్యంగా అంశాలపై లోతుగా చర్చించేవారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు, ఎస్పీలు కూడా సమగ్ర వివరాలతో సదస్సుకు హాజరయ్యేవారని, కానీ ఇప్పుడు అలా వచ్చినట్టు కనిపించడంలేదని, సీఎం అడిగిన ప్రశ్నలకు సాదాసీదాగా సమాధానాలివ్వడంతో సదస్సు ఆద్యంతం తేలిపోయినట్టుగా సాగిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

