హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాతగా అభివర్ణించారు. మంగళవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. ఐలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు నాటి భూ పోరాటానికి ముందుకు వచ్చారని సీఎం గుర్తుచేశారు.