అదిలాబాద్ : స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాల(Self Help Groups)కే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయం(Nagoba Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేస్లాపూర్లో మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా లక్ష్యం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.