హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని, మాదిగలపై పార్టీ వైఖరి ఏమిటని ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీశ్మాదిగ, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం, ఓయూ జేఏసీ మాజీ చైర్మన్ పిడమర్తి రవి నిలదీశారు. సోమవారం పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాసు మున్షీని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని వారికి వివరించినట్టు గాంధీభవన్లో మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ఖర్గే, నేత రాహుల్, ప్రియాంకగాంధీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మాదిగలకు ఇచ్చే పదవుల గురిం చి రెండు రోజుల్లో ప్రకటిస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. రా జ్యాంగాన్ని, రిజర్వేషన్ల రద్దుకు తహతహలాడుతున్న బీజేపీకి, మోత్కుపల్లి, మందకృష్ణ మాటలను మాదిగలు పట్టించుకోవద్దని సతీశ్మాదిగ పిలుపునిచ్చారు.