Mid Day Meals | మహబూబ్నగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): /కోస్గి టౌన్ : సాక్షాత్తు సీఎం ఇలాకాలో విద్యార్థుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం అందించకపోవడంతో పస్తు లు ఉంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం నాచారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొన్ని రోజులుగా విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థులంతా స్కూలుకు వచ్చి పస్తులు ఉంటూ ఇంటికి వెళ్లి తింటున్నారు. నాణ్యమైన భోజనం వండకపోవడం తో విద్యార్థులు తినడం లేదు.
ఉపాధ్యాయు లు – వంట ఏజెన్సీకి మధ్య కొంతకాలంగా తగాదా నడుస్తున్నది. ప్రభుత్వం కూడా ఏజెన్సీలకు నెలనెలా బిల్లులు చెల్లించకపోవడం తో అరకొరగా వండి పెడుతున్నారు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హుటాహుటిన నారాయణపేట డీఈవో గోవిందరాజులు గురువా రం నాచా రం పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట ఏజెన్సీ నిర్వాహకులకు మధ్య గొడవతో మధ్యాహ్నం భోజనం నిలిచిపోయిందని విచారణలో తేలడంతో హెచ్ఎంతోపాటు ఏజెన్సీ నిర్వాహకులపై డీఈవో సీరియస్ అయ్యారు.
హెచ్ఎం నిర్వాకంతోనే ఇదంతా జరుగుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వంట ఏజెన్సీ నిర్వాహకులు కూడా హెచ్ఎంపై ఫి ర్యాదులు చేస్తున్నారు. తప్పులను ఎత్తి చూపిస్తున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని హెచ్ఎం వివరణ ఇచ్చారు. సీఎం నియోజకవర్గం విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. హెచ్ఎంను మార్చాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.