మహారాష్ట్రతో నిరంతరం సంప్రదించండి
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు, నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులను కొనసాగించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
- తమ్మిడిహట్టిపై ఆ రాష్ట్రం కోరిన సమాచారమివ్వండి
- ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు, నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులను కొనసాగించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చల అనంతర పరిణామాలు, ఆ రాష్ట్ర అభ్యంతరాలు తదితర అంశాలపై చర్చించారు.
మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల వివరాలు సిద్ధం చేయాలని, గత ఒప్పందాల పత్రాలన్నీ మహారాష్ట్ర అధికారులకు అందజేయాలని రేవంత్ సూచించారు. ముంపు భూములపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. సమీక్షలో ఆ శాఖ సలహాదారు ఆదిత్యానాథ్‌దాస్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

