హనుమకొండ, నవంబర్ 3: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. ఆదివారం హనుమకొండ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి స్వాగతం పలుకకుండా దూరంగా ఉండటంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. దీంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హనుమకొండ జిల్లా మడికొండ సత్యసాయి గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, సుజాత దంపతుల కూతురు డాక్టర్ నిఖితారెడ్డి వివాహానికి రేవంత్ హాజరయ్యారు.
సీఎం తన నియోజకవర్గానికి వస్తే.. ఎమ్మెల్యే కనీసం పలకరించకపోవడంపై పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజకవర్గ సీటు విషయంలో రాజేందర్‌రెడ్డి, రాఘవరెడ్డి ఎప్ప టి నుంచో ఎడముఖం పెడముఖంగా ఉన్నా రు. వీరిద్దరి మధ్య విభేదాలు, అసమ్మతి సీఎం వరకు వెళ్లాయి. ఇప్పటికే సీఎం పర్యటనలకు నర్పంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూ రంగా ఉంటుండగా.. తాజాగా రాజేందర్‌రెడ్డి కూడా అదే దారిలో ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే నాయిని దూరంగా ఉండటానికి కార ణం.. సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తా? లేక ఏమైనా వ్యక్తిగత అంశాలా? అనేది తెలియా ల్సి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకుల వర్గ విభేదాలతో కాంగ్రెస్ అధిష్ఠానం తలలు పట్టుకుంటున్నది. ఈ వివాహ వేడుక కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మం త్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.