NRI Thirupathi Reddy | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన అట్టర్‌ఫ్లాప్ అయిందని, పెట్టుబడులు అన్నీ బోగస్‌గా మారాయని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో పాల్గొన్నవారిలో 90% మంది సీమాంధ్రులే ఉన్నారని, తెలంగాణకు స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని రియల్ఎస్టేట్ దొంగలు మాత్రమే వచ్చారని పేర్కొన్నారు. సీఎం తన కుంటుంబసభ్యులతో కంపెనీలు పెట్టించి, రూ.1,000 కోట్లు, రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడితే లాభం ఏమిటని ప్రశ్నించారు.
అమెరికాలో ఉన్న స్నేహితులు, ఎన్నికల్లో సహాయం చేసినవారిని కలుసుకోవడానికి వచ్చారని మండిపడ్డారు. మంత్రి దుద్దిళ ఔన్నత్యం ఉన్న నాయకుడని, ఆయన ఇలాంటి సమావేశాలకు రాకూడదని హితవుపలికారు. రైతు రుణమాఫీపై కాలయాపనకే అమెరికా పర్యటన తలపెట్టారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల పేరు చెప్పి రుణమాఫీని వాయిదా వేస్తారని చెప్పారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.