హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేయడానికి అంగీకరించిన సీఎం రేవంత్‌కి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో విగ్రహం ప్రతిష్ఠాపన, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలం కేటాయించడానికి సీఎం అంగీకరించారని లిటరేచర్ కమిటీ ప్రతినిధులు టీడీ జనార్దన్, ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ తెలిపారు.