కోర్టుకు హాజరైన సీఎం రేవంత్
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణకు హాజరుకావాలని జడ్జి శ్రీదేవి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎగ్జామినేషన్ ప్రక్రియకు రేవంత్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని సాక్షులు వాంగ్మూలం ఇవ్వడంపై జడ్జి శ్రీదేవి ప్రశ్నించగా.. ఆలాంటిదేమీ లేదని, తప్పు చేయలేదని సీఎం బదిలిచ్చారు. విచారణను జూన్ 4కు వాయిదా వేస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో కూడా తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
ఇంకా చదావలసిన వార్తలు..
పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేస్తాం: మంత్రి ఉత్తమ్
కౌకుంట్ల(దేవరకద్ర), మే 30: కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌తోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నా రు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపూర్ వద్ద రూ.32.5 కోట్ల చేపట్టనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు మంత్రి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే జీఎంఆర్, కలెక్టర్ కుష్బూగుప్తాతో కలిసి శంకుస్థాపన చేశారు.
8మాజీ మావోయిస్టులు సీపీఐలో చేరాలి: కూనంనేని
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : జన జీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు సీపీఐలో చేరాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శనివారం మాజీ మావోయిస్టులు దేవ్‌జీ(తిప్పిరి తిరుపతి), మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్(చంద్రన్న) సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
త్యాగధనులను అందించిన చరిత్ర ఏఐఎస్ఎఫ్ది
ఎంతోమంది త్యాగధనులను దేశానికి అందించిన గొప్ప చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)దని వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ఎగసిన ఉద్యమ తరంగం ఏఐఎస్ఎఫ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

