BC Caste Census | తెలంగాణ బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పునకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారంలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని.. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారంలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.