సిద్దిపేట, ఫిబ్రవరి 7: సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా ‘సీఎం కేసీఆర్ కప్’ పేరిట సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో మంత్రి హరీశ్‌రావు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన ‘సీఎం కేసీఆర్ కప్-2022’ సీజన్లో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌గా రికార్డు దక్కించుకొన్నది.
క్రీడారంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న ‘క్రిక్ హీరోస్’ యాప్.. సీఎం కేసీఆర్ కప్-2022కు బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, బెస్ట్ ఆర్గనైజర్‌గా మంత్రి హరీశ్‌రావు పేరును ప్రకటించింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజున ‘సీఎం కేసీఆర్ కప్-3’ ప్రారంభం సందర్భంగా క్రిక్ హీరోస్ ప్రతినిధులు ఈ అవార్డులను అందించనున్నట్టు తెలిపింది.