హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తన జన్మదిన సందర్భంగా సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫారూఖ్ హుస్సేన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.
ఫారూఖ్ హుస్సేన్ వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫారూఖ్ హుస్సేన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.