CM KCR | కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు స్వాగతం పలుకగా, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసి.. వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.

కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం సీఎం కేసీఆర్, పార్టీకి సెంటిమెంట్‌గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వే స్తారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

