హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన ముఖ్యమంత్రి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెళ్తున్నారు. వరద, ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ పర్యటన సాగిస్తున్నారు. భద్రాచలంలో వరద పరిస్థితిని సమీక్షించనున్నారు. గోదావరి ముంపు ప్రాంతాలను నేరుగా పరిశీలిస్తారు. మంత్రులు, అధికారులకు సూచనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.
కాగా, హనుమకొండ నుంచి భద్రాచలం వరకు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నది. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో ఏటూరునాగారం బయల్దేరారు. అయితే ఏటూరు నాగారంలో ఆగకుండా ముఖ్యమంత్రి నేరుగా భద్రాచలం వెళ్తున్నారు.