హైదరాబాద్/జనగామ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగా నిర్మిం చిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితోపాటు కలెక్టర్ శివలింగయ్య ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ రోడ్డులో నూతన కార్యాలయం వద్ద బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందికిపైగా జనసమీకరణ చేయాలని సూచించారు. కాగా, 12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.