మిషన్ 2024.. కేసీఆర్ టార్గెట్..ఇవే కేసీఆర్ లక్ష్యాలు!
cm kcr mission 2024:ఈ దేశాన్ని ఎవరు మార్చాలి ? ఈ సమాజాన్ని ఎవరు ఉద్దరించాలి ? ప్రజల ఆశయాలను తీర్చేదెవరు ? పేదరికాన్ని ఎవరు నిర్మూలించాలి? అణగారిని ప్రజలను ఎవరు ఆదరించాలి ? విద్వేషం లేని లోకాన్ని ఎలా స్థాపించాలి ? ప్రజాస్వామ్య రీతిలో ధర్మపాలన ఎలా సాగించాలి ? రాజ్యాంగం ఆకాంక్షించిన అభ్యున్నతిని ఎలా
హైదరాబాద్: ఈ దేశాన్ని ఎవరు మార్చాలి ? ఈ సమాజాన్ని ఎవరు ఉద్దరించాలి ? ప్రజల ఆశయాలను తీర్చేదెవరు ? పేదరికాన్ని ఎవరు నిర్మూలించాలి? అణగారిని ప్రజలను ఎవరు ఆదరించాలి ? విద్వేషం లేని లోకాన్ని ఎలా స్థాపించాలి ? ప్రజాస్వామ్య రీతిలో ధర్మపాలన ఎలా సాగించాలి ? రాజ్యాంగం ఆకాంక్షించిన అభ్యున్నతిని ఎలా సాధించాలి ? ఇవే కేసీఆర్ లక్ష్యాలు. ఈ భూగోళంపై ఈ దేశాన్ని సర్వోన్నతంగా నిలపడమే ఆయన స్వప్నం. ఆ టార్గెట్‌తోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సమరశంఖం పూరిస్తున్నారు. ఈ దేశానికి పట్టిన పీడను విజయదశమి వేళ తరిమికొట్టే ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనే పరమావధిగా భావిస్తున్న కేసీఆర్.. ఇవాళ కొత్త రాజకీయ పార్టీకి జీవం పోస్తున్నారు.
భారతదేశాన్ని, భారత ప్రజలను ప్రగతిశిఖరంపై ప్రతిష్టింపజేసందుకు కేసీఆర్ ప్రతిన పూనారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని నెలల నుంచి దేశ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాలను ఆయన విజిట్ చేశారు. కేంద్ర సర్కార్ సాగిస్తున్న ఆగడాలను ఆయా రాష్ట్రాల నేతలతోనూ ఆయన చర్చించారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కేసీఆర్ వివిధ దేశాధినేతలతోనూ ముచ్చటించారు. బీజేపీ అవలంభిస్తున్న వైఖరిని ఆయన నిర్మోహమాటంగా వ్యతిరేకించారు. సమసమాజ స్థాపన కోసం సమాఖ్య పాలన అవసరం అన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ ప్రతి రాష్ట్ర పర్యటనలోనూ తన స్వరంగా వినిపించారు. ఈ దేశానికి మార్పు అవసరం. ఆ మార్పును తీసుకువచ్చేందుకు కేసీఆర్ కొత్త పార్టీకి ప్రాణం పోస్తున్నారు.
కొన్ని దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏలింది. కానీ ఆ పార్టీ ఈ దేశ ప్రజల స్థితిగతులను మార్చలేకపోయింది. రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో ఆ పార్టీ దారుణంగా విఫలమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తోంది. ఆ పార్టీ కూడా పేలవ పాలన కొనసాగించింది. ఆశించిన స్థాయిలో ప్రగతి లేదు. ప్రజల అవసరాలను తీర్చే ఆరాటం కూడా ఆ పార్టీకి లేదు. ఈ నేపథ్యంలో దేశ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలు మొదలుపెట్టారు. 2018 నుంచే ఆయన దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్, బీజేపీ విఫలమైన నేపథ్యంలో కొత్త పార్టీ అవసరమన్న విషయాన్ని కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారు. ఆ దిశగానే ఇవాళ గులాబీ పార్టీ కొత్త అవతారమెత్తనున్నది.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన ప్రణాళికలు వేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కొత్త పార్టీ ప్రకటిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

