CM KCR | నేనేక్కడిదో అమెరికా కథ చెప్పట్లేదు.. మీ తాండూరు కథనే చెప్తున్నా : సీఎం కేసీఆర్
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాలు పెరిగాయి. ఇదంతా మీ కండ్ల ముందే ఉంది. నేనేక్కడిదో అమెరికా కథ చెప్పట్లేదు. మీ తాండూరు కథనే చెప్తున్నా అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | తాండూరు : కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాలు పెరిగాయి. ఇదంతా మీ కండ్ల ముందే ఉంది. నేనేక్కడిదో అమెరికా కథ చెప్పట్లేదు. మీ తాండూరు కథనే చెప్తున్నా అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో పోల్చిచూడాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్. కనీసం మంచినీళ్లు, సాగునీళ్లు ఇవ్వలేదు. తాండూరు ప్రజలు కాగ్నా నది వద్ద గుంతలు తీసి వడకట్టుకొని నీళ్లు తాగేది కాంగ్రెస్ రాజ్యంలో. కానీ ఈ రోజు మిషన్ భగీరథతో ప్రతి తండాలో, చిన్న ఊరులో కూడా పరిశుద్ధమైన నీరును సరఫరా చేస్తోంది. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పాలనలో. పదేండ్ల కాలంలో మారుమూల తండాలకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాం అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు..
తెలంగాణ వచ్చిన కొత్తలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ప్రజలంతా బతుకపోవుడు. అర్థరాత్రి కరెంట్ కోసం పోయి తాండూరులో 40 మంది రైతులు షాకులతో, పాములు కరిచి చనిపోయారు. ఇవన్నీ మీరు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆర్థికనిపుణులతో చర్చించి ఒక లైన్ తీసుకున్నాం.పేదల సంక్షేమాన్ని ముందు తీసుకున్నాం. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలు చేశాం. కంటి వెలుగు ద్వారా కండ్లద్దాలు పంపిణీ చేశారు. గర్భిణుల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలు అమలు చేశాం అని కేసీఆర్ తెలిపారు.
రైతులు చల్లగా ఉంటేనే దేశం బాగుంటది..
సంక్షేమం తర్వాత వ్యవసాయ రంగం తీసుకున్నాం. వ్యవసాయం బాగుంటే, రైతులు చల్లగా ఉంటే దేశం కూడా బాగుంటది. ప్రాజెక్టుల కింద నీళ్లు పారుతే ఇతర రాష్ట్రాల్లో పన్నులు వసూళ్లు చేస్తరు. మేం నీటి తిరువా రద్దు చేశాం. మేలైన విద్యుత్ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్. అదృష్టం బాగాలేక రైతు ఎవరైనా చనిపోతే దినవారం లోపే 5 లక్షల బీమా ఇస్తున్నాం. 7500కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నాం. ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ రైతులు బాగుండాలని మద్ధతు ధరకు కొంటున్నాం. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకు ఖాతాలో వేస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

