హైదరాబాద్ : రాహుల్ గాంధీని అస్సాం ముఖ్యమంత్రి అవమానించడంపై సీఎం కేసీఆర్ రాయగిరి సభలో లేవనెత్తిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఇవాళ జరిగిన ప్రెస్ మీట్లోనూ సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి మాట్లాడినంత మాత్రాన అది కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టు కాదు అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ అడిగిన దాంట్లో తప్పేం ఉంది. సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ప్రూఫ్స్ అడిగాడు. ఉంటే ఉన్నయని చెప్పండి.. లేకపోతే లేవని చెప్పండి.. లేకపోతే నీకు ఏం చేతగాదు.. అనండి.. ఆయనపై ఆరోపణలు చేయండి కానీ.. అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అస్సాం ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సరైన విధానంలో లేదు అని నేను ఖండించాను. ఇందులో తప్పేముంది. ఆయన ఏం అడిగారు. ప్రూఫ్ అడిగారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఏఐసీసీ ప్రెసిడెంట్ ఆయన.. ఎంపీ.. ఆయనకు అడిగే హక్కు ఉంది. కానీ.. అస్సాం ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానం అలా ఉంటుందా? అంటూ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.