వారసత్వ సంపద తెలంగాణ సొంతం
ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని స్మరించుకోవాలని ఆయన సోమవారం పిలపునిచ్చారు.
- చారిత్రక ప్రాశస్త్యాన్ని స్మరించుకుందాం
- వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని స్మరించుకోవాలని ఆయన సోమవారం పిలపునిచ్చారు. శాతవాహన వంశం నుంచి అసఫ్జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేసిందని పేరొన్నారు. ఇకడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంసృతి సంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని తెలిపారు.
ఎన్నెన్నో గొప్ప కట్టడాలు మనవి..
జైన, బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గో లొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చి, మకా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం కేసీఆర్ పేరొన్నారు.
స్వరాష్ట్రంలో ఆధునీకరణలు
స్వరాష్ట్రంలో వారసత్వ సంపదల పరిరక్షణలో భాగంగా ఖిలా వరంగల్ కోట ఆధునీకరణ, చార్మినార్, మకా మసీదు మరమ్మతులు, మొజంజాహి, మోం డా మారెట్ అభివృద్ధి, మరెన్నో కట్టడాలకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 300 ఏండ్ల ప్రాచీనమైన బన్సీలాల్ పేట మెట్ల బావిని పునరుద్ధరించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

