కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దారుణమైన బడ్జెట్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం.. నదుల అనుసంధానం బిగ్ జోక్ అని.. జోక్ ఆఫ్ ది మిలీనియం అన్నారు.
నదుల అనుసంధానం చేస్తారట.. సిగ్గు చేటు ఇది.. ప్రభుత్వం సిగ్గు పడాలి. గోదావరి కృష్ణ అనుసంధానం ఎలా చేస్తావు. ఏ అధికారంతో గోదావరి, కృష్ణ, కావేరిని అనుసంధానం చేస్తా అని చెప్పావు. గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు ఆధారంగా ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిన ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాల మీదనే ఉంటది అని వాటర్ ట్రిబ్యునల్ తీర్పు ఉంది. ఆ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌తో సమానం. మా నీళ్లను మమ్మల్ని అడగకుండా గోదావరి జలాలను కావేరీ నదిలో ఎలా కలుపుతావు. ఏ చట్టం ప్రకారం కలుపుతావు. ఇది జోక్ కాదా. ఇది సెన్స్ లెస్ కాదా. తెలివితక్కువతనం కాదా.. అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఎలా కలుపుతావు. మిగులు జలాలు ఉంటే ఇవ్వాలి. ఉంటే తెలంగాణ కోసం పంపించిన ప్రతిపాదనలకు ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దేశాన్ని ఇంత గోల్ మాల్ చేస్తారా? డీపీఆర్‌లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నీ ఇచ్చాం. ఇవన్నీ అక్కడ పెట్టుకొని.. గోదావరి జలాలను కావేరీలో కలుపుతవా? నీ ప్రాతిపదిక ఏంటి. తెలంగాణ, ఆంధ్రా అవసరాలు తీరిపోయాయా. మొత్తం ఇచ్చావా.. ఇచ్చేయంగ మిగిలినయా. ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఒకటి చేస్తం అంటే ఎలా చేస్తరో చెప్పాలి. మాతో మాట్లాడావా దీని గురించి. పచ్చి అబద్ధాలు అండి. తెలివైన దేశాలు వందల కిలోమీటర్లు తీసుకుపోయి నీళ్లు ఇస్తున్నాయి. ఇవాళ మేము కూడా ఇస్తున్నాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ.. మీరు పట్టించుకోకున్నా మేము తీసుకొచ్చి నీళ్లు ఇస్తున్నాం. మేము పండించిన పంట కొనే తెలివి లేదు మీకు.. కానీ నదుల అనుసంధానం చేస్తరా అంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.