డీజీపీ మహేందర్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కర్త, రూపకర్త డీజీపీ మహేందర్ రెడ్డినే అని సీఎం చెప్పారు. నిజం చెప్పాలంటే పొగడ్తలు నాకు అందించారు. కానీ ఈ పొగడ్తకు అర్హులు మహేందర్ రెడ్డినే కేసీఆర్ స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలన్న ఆలోచన వారిదే. అనేక సందర్భాల్లో అనేక విషయాలు చర్చిస్తున్నప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. అనేక సందర్భాల్లో జరిగిన చర్చల్లో పటిష్టమైన పద్ధతుల్లో ఏ విధంగా ముందుకు పోవాలని చర్చించాం. మహేందర్ రెడ్డి ఆలోచన మేరకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాం.
మహేందర్ రెడ్డి డ్రస్సు మాత్రమే మారుతుంది..
ఈ ఏడాది డిసెంబర్లో డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉంది. ఆయన ఏదో రూపంలో తెలంగాణకు సేవ చేస్తూనే ఉండాలి. ఒక వేళ డ్రస్సు మారినా ఆయన సేవ మాత్రం మారదు. ఏకే ఖాన్ మైనార్టీ వెల్ఫేర్ గురించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ అద్భుత ఫలితాలు వస్తున్నాయి. వారి సేవలు కూడా కొనసాగాలని కోరాను. మీ అందరి సహకారం, ప్రస్తుత పోలీసుల పనితీరు, ప్రజల యొక్క సహకారం గత 8 సంవత్సరాలుగా శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకుపోతున్నాం. భవిష్యత్‌లో కూడా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. హైదరాబాద్‌లో చాలా నేరాలు తగ్గాయన్నారు సీఎం కేసీఆర్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

