CM KCR | అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్ : సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Ambedkar ) 132వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర, ఆయన జాతికి అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
CM KCR | హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్( Ambedkar ) 132వ జయంతి సందర్భంగా ఆయనను సీఎం కేసీఆర్( CM KCR ) స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ గమనాన్ని మార్చడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర, ఆయన జాతికి అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
అడ్డుంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనం అని పేర్కొన్నారు. ఎంతటి పనైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యం చేరుకోవడం ఖాయం. కుల వివక్ష, అంటరానితనం పట్ల ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆత్మనూన్యతకు, దుర్భలత్వానికి లోనుకాకుండా గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వమానవుడు అంబేద్కర్ అని కేసీఆర్ పేర్కొన్నారు.
సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన మేధావి అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. సమస్త శాస్త్రాలను ఔపోసన పట్టిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ప్రజాస్వామ్యం, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, వర్ణ వివక్షత, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు ఆలోచింపజేశాయి. అసమానతలు లేని ఆధునిక భారతాన్ని ఆవిష్కరించేందుకు అన్ని వ్యవస్థల్లో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్. తన మేధస్సుతో మదించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగానికి రూపమిచ్చారు. నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

