హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ, దివంగత పాకాల హరినాథరావుకు సీం కేసీఆర్ నివాళులర్పించారు. సోమవారం ఫిల్మ్‌నగర్‌లో హరినాథ్‌రావు పెద్దకర్మను నిర్వహించారు. హరినాథ్‌రావు కూతురు శైలిమ, కుమారులు రాజేంద్రప్రసాద్, శైలేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, ఇతర కుటుంబసభ్యులతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్,ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, కవితానాయక్, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, కాలె యాదయ్య, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతికిరణ్, సీఎస్ సోమేశ్‌కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు నివాళులర్పించారు.