హైదరాబాద్ : ప్రగతి భవన్లో కమ్యూనిస్ట్ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీపీఎం, సీపీఐ నేతలతో వేర్వేరుగా సీఎం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. వీరితో భేటీ ముగిసిన అనంతరం సీపీఐ జనరల్ సెక్రటరీ డి రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కేసీఆర్ సమావేశం అయ్యారు. కేంద్ర విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.
సీపీఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పినరయి విజయన్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను.. సీఎం కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు.
ప్రగతి భవన్లో కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం pic.twitter.com/y1qqPo5LFt
— Namasthe Telangana (@ntdailyonline) January 8, 2022