కమాండ్ కంట్రోల్ సెంటర్.. సంకల్ప బలానికి ప్రతీక : సీఎం కేసీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం ప్రభుత్వ సంకల్ప బలానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావాలని చెప్తూ వచ్చాను. అది నెరవేరింది. మరో చిన్న కోరిక ఉంది. సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కావాలి. దేవానికే ఆదర్శంగా నిలవాలి. ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే కష్టం.
హైదరాబాద్‌లో ఇంత మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తదని ఎవరూ ఊహించి ఉండరు. సంకల్పంతో దీన్ని నిర్మించాం. ఈ ఫలితం మన కండ్ల ముందు నిలబడి నిలువెత్తు సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు దాని ముందు మాట్లాడుతున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీక. చిత్తశుద్ధితో చాలా చేశాం. గుడుంబా నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకున్నాం. పేకాట క్లబ్బులను మూసివేశాం. గతంలో పేటకో క్లబ్ ఉండేది. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత చురుకుగా పని చేయాలి. మంచిని సాధించడానికి మంచి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు సేవ అందించే సంస్థ కావాలి. సంస్కారవంతమైన పోలీసుగా తయారు కావాలి. ఆ విధంగా పురోగమించాలి. పెద్దల సలహాలు కూడా తీసుకోవాలి. గతంలో పని చేసిన పోలీసు కమిషనర్లు హైదరాబాద్‌కు గొప్ప సేవలందించారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

