మొన్న గుజరాత్… నేడు ముంబై.. ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కడి తెలంగాణ బిడ్డలు అభిమానం చాటుకుంటూనే వున్నారు. ముంబై పర్యటనకు ఒక్క రోజు ముందే ముంబైలో తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్కు సంబంధించి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. సీఎం కేసీఆర్కు అభిమాని అయిన తెలంగాణ సాయి.. ఈ ఫ్లెక్సీలపై దేశ్ కీ నేత… సీఎం కేసీఆర్ అంటూ రాయించారు. అంతేకాకుండా దేశానికి భవిష్యత్ నేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటూ భారీ ఎల్ఈడీ స్క్రీన్నే ఏర్పాటు చేయించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతటా అమలు చేయాలంటూ తెలంగాణ సాయి ఆ ఫ్లెక్సీలో నినాదాలు రాశారు. త