చలికాలం.. జర పైలం
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్ల లు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యు లు సూచిస్తున్నారు.
- పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- ఉదయం వేళల్లో పొగమంచు
- శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం
- వృద్ధులు, చిన్నారులపై ప్రభావం
- జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్ల లు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యు లు సూచిస్తున్నారు. శీతాకాలంలో శ్వాస సంబంధ, ఊపిరితిత్తుల సమస్యలతో చర్మ సంబంధ వ్యాధులు అధికంగా వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్థులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్యాక్టీరియా బయటకు వస్తుందని, వాటిని పీల్చితే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వ్యక్తులకు వ్యాధి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు వే గంగా తగ్గుతున్న తరుణంలో గుండెజబ్బు లు వచ్చే అవకాశం కూడా ఉన్నదని తెలిపా రు. చలికాలంలో జీవనశైలిని మార్చుకోవాలని సూ చించారు. వేడి పోషకాహార పదార్థాలు తీసుకోవాలని, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. వృద్ధులు, చిన్నారులపై చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేండ్లలోపు పిల్లలకు శ్వాస సంబంధ న్యుమోనియా, ఆస్తమా వస్తాయని, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్లో చలి..
హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 58 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజు ల్లో చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.
వచ్చే రెండురోజులు మరింత చలి
రాష్ట్రంలో రానున్న రెండురోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతోపాటు గాలిలో తేమశాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తున్నట్టు పేర్కొన్నారు. మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్, మధ్య తెలంగాణలో చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ వాయవ్య దిశలో కొంత వేడి ఉంటుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

