హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నేషనల్ లా స్కూల్స్, వర్సిటీల్లో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) దరఖాస్తుల గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు.
ఈ గడువు శుక్రవారం ముగియగా, తాజాగా మరోసారి అవకాశం కల్పిస్తూ నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్టియం నిర్ణయం తీసుకొన్నది.