కేజీబీవీలో దళిత విద్యార్థిని అనుమానాస్పద మృతి
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ కస్తూర్బా పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన సంతోష్, యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.
- విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి : దుబ్బాక ఎమ్మెల్యే
సిద్దిపేట/తొగుట, అక్టోబర్ 29 : సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ కస్తూర్బా పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. బాధిత కుటుంబం వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన సంతోష్, యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె లాస్య (15) సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నది. దసరా సెలవుల అనంతరం ఈనెల 24న లాస్యను ఆమె తండ్రి సంతోష్ పాఠశాలలో వదిలి వెళ్లారు. ఈ నెల 28 రాత్రి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి లాస్య ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. గంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి లాస్య మూడురోజుల క్రితం పుష్పవతి అయిందని, ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాలని సూచించారు.
లాస్యకు తీవ్ర రక్తస్రావం అవుతున్నదని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్నామని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు దవాఖాన వద్దకు చేరుకున్నారు. అప్పటికే లాస్య మృతిచెందిందని వైద్యులు పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జనరల్ దవాఖాన మార్చురీ వద్దకు చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. కొంతమంది ప్రతినిధులు, కుటుంబసభ్యులు కలెక్టరేట్‌కు రావాలని కలెక్టర్ సూచించడంతో విషయం సద్దుమణిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

