హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ) : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనకు భారత పౌరసత్వం లేకపోయినప్పటికీ తప్పుడు పత్రాలను సమర్పించి ఎన్నికల్లో పోటీచేసి, గెలుపొందారని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేయడంతో ఐపీసీలోని 465, 468, 471 సెక్షన్లతోపాటు ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్-1967లోని సెక్షన్ 12, ఇండియన్ సిటిజన్‌షిప్ యాక్ట్-1955లోని సెక్షన్ 17 కింద ఈ కేసు నమోదైంది. దీంతో తమ కేంద్ర కార్యాలయానికి రావాలని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆది శ్రీనివాస్‌ను సీఐడీ పోలీసులు కోరారు.