హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ గు రువారం వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆదిలాబాద్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో పనిచేస్తున్న పోస్టల్ అసిస్టెంట్ ప్ర ణబ్, నిజామాబాద్ ఎస్బీ ఏఎస్సై లక్ష్మణ్, ముంబైకి చెందిన పాస్‌పోర్టు ఏజెంట్‌ను అరె స్టు చేశామని తెలిపారు. గతంలో ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్టు చేయగా.. ఇటీవల చెన్నై పాస్‌పోర్టు ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ముగ్గురిని అరె స్టు చేయడంతో అరెస్టుల సంఖ్య 15కు చేరిం ది. వీరంతా శ్రీలంక నుంచి అక్రమంగా వలస వచ్చిన 95 మందికి పాస్‌పోర్టులు జారీ చేసినట్టు తాజా విచారణలో తేలిందని చెప్పారు.
మూడు రోజుల విచారణ అనంతరం నిందితుడు ప్రణబ్‌ను అధికారులు గురువా రం 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేయగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు.