హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు శంకర్ లూక్, పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్ తదితరులు పాల్గొని క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.