బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 00:35:14

క్రైస్తవుల ఓట్లు కారుకే

క్రైస్తవుల ఓట్లు కారుకే

క్రిస్టియన్‌ సేవా సంఘం అధ్యక్షుడు డేవిడ్‌ రాజు

ఖైరతాబాద్‌, నవంబర్‌29: దేశంలో సెక్యులరిజాన్ని దెబ్బతిసేందుకు బీజేపీ నాయకులు హిందూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, అలాంటి పార్టీని గ్రేటర్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని క్రిస్టియన్‌ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్‌ రాజు పిలుపునిచ్చారు. అన్ని మతాల వారికి అండగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కొందరు హిందూవాదులు బీజేపీలో చేరి మత రాజకీయాలు చేస్తున్నారని, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో స్వయంగా ప్రధాని మోదీతోపాటు ఆ పార్టీ జాతీయ అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలతో క్రైస్తవులంతా అభద్రతకు లోనయ్యారని చెప్పారు. గ్రేటర్‌ పరిధిలో 5లక్షలకు పైగా క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్స్‌, క్యాథలిక్‌ రెడ్డి, చౌదరి తదితర అన్ని వర్గాల వారు నివసిస్తున్న నేపథ్యంలో.. క్రైస్తవులకు రక్షణ కల్పించేందుకు సీఎం కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ తాటికొండ రాజయ్య, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ గత కొన్ని రోజులుగా క్రైస్తవ నాయకుల కౌన్సిల్స్‌తో సంప్రదింపులు జరిపారని చెప్పారు. క్రైస్తవుల రక్షణకు, సంక్షేమానికి, మత విశ్వాసాల ప్రకటనకు, రాజకీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో క్రైస్తవులంతా ఒకే తాటిపై ఉండి టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నారని స్పష్టంచేశారు. మీడియా సమావేశంలో సామ్యూల్‌ రాజు, బెన్‌ ధీరజ్‌, శ్రీకాంత్‌, సురేశ్‌, సాయి, ప్రసాద్‌ పాల్గొన్నారు.logo