Congress | కరీంనగర్ రాంనగర్, జనవరి 13 : బీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని, అవసరమై తే ఆఫీసులకు వచ్చి కొడ్తమని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రివ్యూ సమావేశంలో కౌశిక్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, అతడిని కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే.. బీఆర్ఎస్ ఆఫీసులకు వచ్చి దాడులు చేస్తామంటూ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ‘మీరు ఇటుకలతో కొడితే మేము రాళ్లతో సమాధానం చెప్తాం’ అంటూ హెచ్చరించారు.