హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా టికెట్ల ధరలను పెంచుకొనేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ తిరసరించింది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్కు చెందిన డీ చంద్రబాబు శనివారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
కోర్టుకు శనివారం సెలవు దినం కావడంతో హౌస్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి విచారణకు స్వీకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయగోపాల్ రిజిస్ట్రీని కోరారు. ఇందుకు రిజిస్ట్రీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. సంక్రాంతి పండుగ తర్వాత 19న కోర్టు పనిచేస్తుందని, రెగ్యులర్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పింది.
టికెట్ల ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న మెమో జారీచేసింది. అప్పటికే రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపు మెమోను సవాల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ సమయంలో ‘మనశంకర్ వరప్రసాద్‌గారు’ సినిమా టికెట్ల ధరల పెంపును ఎందుకు ప్రస్తావించలేదనే చర్చ జరుగుతున్నది.