China Jeeyar Swamy | దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు : చిన జీయర్ స్వామి
China Jeeyar Swamy | దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని అవి మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలు కావాలని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy )అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మూలవిరాట్ విగ్రహాల భద్ర పీఠం పునర్ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా ఘనంగా జరిగింది.
సూర్యాపేట : దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని అవి మనిషిలో మంచి పరివర్తన తెచ్చే నిలయాలు కావాలని త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinna Jeeyar Swamy )అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మూలవిరాట్ విగ్రహాల భద్ర పీఠం పునర్ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా ఘనంగా జరిగింది. ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు సంప్రోక్షణ పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించగా మధ్యాహ్నం జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ పునర్ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్న జీయార్ స్వామి మాట్లాడుతూ..దేవాలయాల్లో పూజలు ప్రసాదాలు కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయని అవి అందరికీ మంచి చేసేలా ఉపయోగపడాలన్నారు. స ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహంతో ఇక్కడ అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టుతున్నామని, ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామన్నారు. త్వరలోనే వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టుకుందామన్నారు.
రాష్ట్రంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల జీయర్ స్వామి కృష్ణమాచార్యులు, దేవాలయ అర్చకులు నల్లన్ చక్రవర్తుల మురళీధరాచార్యులు, నల్లన్ చక్రవర్తుల వేణు గోపాలా చార్యులు, ఉప్పల గోపాలకృష్ణయ్య, వీర్లపాటి సత్యనారాయణ, కొత్తపేట రామకృష్ణ, కందిమల్ల శంకర్, విజయ్ కుమార్, శ్రీరంగం సోమలక్ష్మి, పద్మ, శ్రీరంగం రాము, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

